ఓ దేవుడా,
మా చీకట్లలో వెలుగులు నింపి,
మాతో ప్రేమ మరియు శాంతితో భాషిస్తున్నావు.
దేవా! మేము ఒక్కసారి నీతో మాట్లాడితే నీవు వేయి సార్లు మాతో మాట్లాడుతావు,
మేము ఎలా ఉన్నా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తావు.
మా హృదయాల్లో కొలువై ఉండి,
మా అవసరాలను, బాధని తీరుస్తావు.
కొంచెంకొంచెంగా మేము నీ దరికి చేరుతున్నాము.
నీవు మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చావ్
నీవి మాకు ప్రేమనిచ్చావ్
నీవు మాకు ఆశనిచ్చావ్
నీవు మాలో జిజ్ఞాసను నింపావ్
పరిశుద్ధత, నిష్కపటత నిండిన
హననీయమైన, అందమైన మేము
ఆద్యంతమూ మీ బిడ్డలము.
నీలాగే ఎంతో స్వేచ్ఛగా, స్వచ్చంగా ఉన్నాము.
కష్టాల్లో మాతో నడిచి,
మమ్మల్ని వెన్నంటి ఉండే
ఓ దేవా, నీవు మాతో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటావు.
ఆమెన్